టమాటా బంగారం అయిపోయిందట.. ఈ పెళ్లికూతురు ఏంచేసిందో చూడండి!

Update: 2019-11-20 09:02 GMT
Image taken from video posted on Twitter by Naila Inayat

బంగారం కొనగలిగే పరిస్థితి లేదు. ఇక అదే రకంగా టమాటాలూ కొనేలా లేదు. అందుకే ఈ పని చేసాను అంటోందీమె. పాకిస్తాన్ లో ఓ పెళ్లికూతురు టమాటాలతో చేసిన ఆభరణాలు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. టమాటా ధర కూడా బంగారంలా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది అందుకే టమాటాలతో చేసిన ఆభరణాలు ధరించాను అని ఆమె ఒక పాకిస్తాన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ కి చెందిన పాత్రికేయురాలు నైలా ఇనాయత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

పాకిస్థాన్ కు చెందిన ఓ పెళ్లికూతురు టమాటాలతో చేసిన ఆభరణాలు ధరించింది.. అన్నీ తెలుసు అనుకునే వారికీ ఇంకా తెలీనివి చాలా ఉంటాయని ఈ సంఘటన చెబుతుంది అంటూ కామెంట్ తో నైలా ఇనాయత్ తన ట్విట్టర్ లో ఈ పెళ్లికూతురు ఇంటర్వ్యూ వీడియొ ఉంచారు. దానిలో ఆ పెళ్లికూతురు టమాటా ఆభరణాల గురించి చాలానే చెప్పుకొచ్చింది. మూడు పెట్టెల టమాటాలతో ఈ ఆభరణాలు చేయించారు మా నాన్న అని చెప్పింది. అంతే కాదు టమాటాలు ఆభరణాలుగా ధరిస్తున్నానంటే నేను గొప్పదాన్నని అర్థం అంటూ కూడా చెప్పింది. మీ భర్త నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఈ ముద్దు గుమ్మా ఏం చెప్పిందో తెలుసా..కూరగాయల మార్కెట్ కి వెళ్లిన నా భర్త రోజూ టమాటాలు తీసుకు వస్తే చాలంటూ పంచ్ వేసింది. 

ఈ వీడియో టమాటాలు ధరలపై సెటైర్ గా కనిపిస్తున్నా.. వాస్తవ పరిస్థితులకు అడ్డం పడుతోంది. టమాటాలు కూడా బంగారం మాదిరిగా అయిపోయాయని విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక ఈ వీడియో ను ఇప్పటి వరకూ 33 వేలమందికి పైగా చూశారు. మూడు వేలమందికి పైగా లైక్ చేశారు. మరి మీరూ ఈ వీడియో చూసి ఓ లైకెసుకోండి!

ప్రముఖ వార్తా ఏజెన్సీ పాకిస్తానీ మీడియాని ఉఉటంకిస్తూ తెలిపిన దాని ప్రకారం పాకిస్తాన్ కరాచీ లో రిటైల్ మార్కెట్ లో టమాటా కేజీకి 300 ఉందట. అదే హోల్ సేల్ మార్కెట్ లో 200 రూపాయలు పలుకుతోంది.



Tags:    

Similar News