Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది! పాక్ అధ్యక్షుడు జర్దారీ సంచలన ఆరోపణలు..

Pakistan: భారత్ తమపై మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2026-03-03 05:58 GMT

Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది! పాక్ అధ్యక్షుడు జర్దారీ సంచలన ఆరోపణలు..

Pakistan: భారత్ తమపై మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. సరిహద్దుల్లో భారత సైనిక కదలికలు భారీగా పెరిగాయని, ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగడాన్ని జర్దారీ తీవ్రంగా తప్పుబట్టారు. దీన్ని ఆయన జల ఉగ్రవాదం హైడ్రో టెర్రరిజంగా అభివర్ణించారు.

కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించనంత వరకు దక్షిణాసియాలో శాంతి ఒక కలగానే మిగిలిపోతుందని జర్దారీ మరోసారి తెలిపారు. యుద్ధ క్షేత్రం నుంచి వైదొలగి, చర్చల వేదికపైకి రావాలని భారత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్ నీటిని ఒక ఆయుధంగా మార్చి, పాకిస్థాన్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తోందని.. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని జర్దారీ ఆరోపించారు.

పాకిస్థాన్ ఆరోపణలను భారత్ మొదటి నుంచీ ఖండిస్తోంది. సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకు ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని భారత్ తేల్చిచెప్పింది. గతేడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఉగ్రవాదాన్ని అరికట్టే వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగానే సింధు జలాల ఒప్పందంపై భారత్ నిర్ణయం తీసుకుందని భారత అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News