Operation Sindoor: పాకిస్తాన్‌లో మొదలైన చావు కేకలు.. భారత్‌తో యుద్ధం వద్దంటూ నినాదాలు
Operation Sindoor: పాకిస్థాన్‌ను భారత్ చావుదెబ్బ కొట్టింది. భారత ప్రజలు అందరూ కావాలని కోరుకున్నది కూడా ఇదే.
Operation Sindoor: పాకిస్తాన్‌లో మొదలైన చావు కేకలు.. భారత్‌తో యుద్ధం వద్దంటూ నినాదాలు
Operation Sindoor: పాకిస్థాన్‌ను భారత్ చావుదెబ్బ కొట్టింది. భారత ప్రజలు అందరూ కావాలని కోరుకున్నది కూడా ఇదే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న ప్రతీ భారత పౌరుడు గర్వించే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్‌తో దాడులు జరిపి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి.
భారత్ చేసిన మెరుపు దాడికి పాకిస్థాన్‌లో ప్రజలు అల్లాడుతున్నారు. రోడ్లపైకి వచ్చి... భారత్‌తో యుద్ధం వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో అప్రమత్తైమన ఆర్మీ అధికారులు రాజకీయ నాయకులు తమ కుటుంబాలను దేశాన్ని దాటిస్తున్నట్టు తెలుస్తుంది. పాక్‌లోని ఏటీఎంల దగ్గర జనాలు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో పాకిస్థాన్‌లో ఒక్కసారిగా అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి.