పాక్‌లో గురునానక్ 550 జయంతి సందర్భంగా.. స్మారక నాణేల విడుదల
గురునానక్ జయంతి పురస్కరించుకొని నవంబర్ 9వ తేదీన కర్తార్‌పూర్ కారిడార్ ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
గురునానక్ జయంతి పురస్కరించుకొని నవంబర్ 9వ తేదీన కర్తార్‌పూర్ కారిడార్ ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ భారత్ మధ్య ఒప్పందం ప్రకారం ఇరుదేశాల ప్రతినిధులు సంతకం చేశారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి కర్తార్ పూర్ గురు ద్వారాకు మార్గం కలివుంది.
గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్బంగా స్మారక నాణేలను పాక్ విడుదల చేసిందని, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫేస్‌బుక్ లో పేర్కొన్నారు. యాత్రికుల కోసం పాకిస్థాన్ 80 ఇమ్మిగ్రేషన్ కేంద్రాలను ప్రారంభించింది. ఇందుకు రోజులు 5వేల మంది యాత్రికులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.