Morocco Earthquake: 2 వేలు దాటిన మొరాకో భూకంప మృతుల సంఖ్య

Morocco Earthquake: నిర్మాణ శకలాల కింద మృతదేహాల వెలికితీత

Update: 2023-09-10 11:56 GMT

Morocco Earthquake: 2 వేలు దాటిన మొరాకో భూకంప మృతుల సంఖ్య

Morocco Earthquake: మొరాకో భూకంపంలో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కూలిపోయిన నిర్మాణాల శకలాలను వెలికి తీసే కొద్దీ మృతదేహాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 ఉదయం నాటికి మృతుల సంఖ్య 2012కు చేరింది మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫ్రెంచి వాసిని తాజాగా గుర్తించారు. మరో 14 వందల మంది తీవ్రంగా గాయపడ్డారు.

సెప్టెంబర్ 8 రాత్రి11 గంటలా 11నిమిషాల సమయంలో సంభవించిన ఈ భూకంపం మారకేష్ దాని చుట్టుపక్కల 5 ప్రావిన్సులను భయకంపితులను చేసింది. హై అట్లాస్ పర్వతాల దగ్గర ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. 12 శతాబ్దానికి ప్రముఖ మసీదు కటూబియాకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కింగ్ మహమ్మద్ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఆహారం,పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్థరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిలభవనాల నుంచి వీలైనన్ని నిత్యవసరాలను ప్రజలు తమతో పాటు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News