Suchir Balaji: అమెరికాలో భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి
Suchir Balaji: భారత సంతతికి చెందిన 26 ఏళ్ల సుచిర్ బాలాజీ తన అపార్ట్ మెంట్ లో మరణించారు.
Suchir Balaji: అమెరికాలో భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి
Suchir Balaji: భారత సంతతికి చెందిన 26 ఏళ్ల సుచిర్ బాలాజీ తన అపార్ట్ మెంట్ లో మరణించారు. ఓపెన్ ఏఐ కంపెనీలో 4 ఏళ్లు సుచిర్ పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఆ కంపెనీని వీడారు. ఈ ఏడాది నవంబర్ 26న ఆయన మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఓపెన్ ఏఐలో చేరడానికి ముందు సుచిర్ బాలాజీ కాలిఫోర్నియా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.
తాను ఓపెన్ ఏఐను వీడడానికి కారణం తెలిస్తే ఎవరూ తట్టుకోలేరని ఆయన న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డేటా కలెక్షన్ల కోసం ఓపెన్ ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందన్నారు. చాట్ జీపీటీని అభివృద్ది చేయడంలో ఓపెన్ ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.
బాలాజీ ఆత్మహత్యచేసుకున్నారా? ఇతర కారణాలు ఏమైనా ఆయన మరణానికి కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మరణించడానికి ముందు రోజే ఓపెన్ ఏఐ కంపెనీకి వ్యతిరేకంగా సుచిర్ బాలాజీ పేరుతో కాపీరైట్ కేసు ఫైల్ అయింది.