Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరపోరు
Russia-Ukraine War: ఉక్రెయిన్ లొంగిపోతేనే మానవతా కారిడార్ ఏర్పాటు చేస్తామన్న రష్యా
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరపోరు
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరుదేశాల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్ తిరస్కరించింది. మారియూపోల్ పట్టణాన్ని అప్పగించాలని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేయగా దానికి ఉక్రెయిన్ ఉపప్రధాని నో చెప్పారు. దీంతో ఉక్రెయిన్ లొంగిపోతేనే మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని రష్యా హెచ్చరించింది.