విమానయాన రంగంపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. 5 రోజుల్లో 12 వేల విమానాలు రద్దు

Omicron Effect: వైరస్‌ భయంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న ప్యాసింజర్లు

Update: 2021-12-28 07:56 GMT

విమానయాన రంగంపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌

Omicron Effect: కరోనా మహమ్మారి పౌర విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ ఒమిక్రాన్‌ రూపంలో మరో గండం ఎదురైంది. ఈ డెడ్లీ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు సురక్షితం కాదని భావిస్తున్న ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో అనేక విమానాలు రద్దవుతున్నాయి.

ఒమిక్రాన్‌ భయంతో విమానయాన రంగం మళ్లీ కష్టాల్లోకి జారుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 5 రోజుల్లో దాదాపు 12వేల విమానాలు రద్దయినట్లు ఓ ప్రైవేట్‌ సంస్థ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 3వేల విమానాలు రద్దు కాగా ఇవాళ మరో వెయ్యికి పైగా విమాన ప్రయాణాలు రద్దయినట్లు తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్‌ భయంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా విధులకు హాజరుకావడంలేదని ఆ సంస్థ తెలిపింది. ప్రతి ఏటా డిసెంబర్‌ చివరివారంలో ప్రయాణికులతో కిటకిటలాడే ఎయిర్‌పోర్టులు ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో బోసిగా మారాయి.

Tags:    

Similar News