కరోనా దెబ్బకు మారుతున్న సంప్రదాయాలు.. ప్రపంచం అంతా భారతీయ సంప్రదాయం

Update: 2020-03-13 06:37 GMT
leaders says namaste instead of giving shake hand

కరోనా వైరస్ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. సామాన్యుల నుంచి వీఐపీల దాకా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందున్నారు. కరోనా వార్తలు వచ్చినప్పటి నుంచి ట్రంప్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. పైగా వివిధ దేశాధ్యక్షులను కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చెబుతున్నారట.

ఇటు కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయాలు మారిపోతున్నాయి. జనాలు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేశారు. భారతీయులు అనుసరించే నమస్తేకు అందరూ జై కొడుతున్నారు. దేశాధినేతలు సైతం నమస్తే చెప్పాలంటూ సూచిస్తున్నారు. ట్రంప్‌ సైతం భారతీయులను ఫాలో అవుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న ట్రంప్ తో ఐర్లండ్ ప్రధాని లియో వరాద్కర్ భేటీ అయినప్పుడు ఇద్దరూ నమస్తే చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ మాత్రమే కాదు ఇటీవల ప్రిన్స్ ఛార్లెస్ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వబోయి వెంటనే చేయిని వెనక్కి తీసుకొని నమస్కారం చేయడం వైరల్‌గా మారింది.

తమ భేటీలో మేమిద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని ఒకరినొకరు చూసుకున్నామని ట్రంప్‌ చెప్పారు. కాసేపు ఇబ్బందిగానే అనిపించినా నమస్తే చెప్పుకున్నామని ఈ మధ్య ఇండియా నుంచి వచ్చానని అక్కడ ఎవరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదన్నారు. చేతులు జోడించి నమస్తే పెట్టడం చాలా బాగుందంటున్నారు. నిజానికి తాను ఎక్కువగా షేక్ హ్యాండ్ ఇవ్వనని కానీ రాజకీయాల్లో వచ్చిన వారికి ఇది తప్పదని అన్నారు. ఇప్పుడు కోవిడ్‌ వణికిపుట్టిస్తోందని అందుకే షేక్‌హ్యాండ్‌కు బదులు నమస్కారం చెబుతున్నట్లు తెలిపారు.


Full View


Tags:    

Similar News