కరోనా మళ్లీ రాదనేందుకు ఆధారాలు లేవు.. డబ్ల్యూహెచ్‌ఓ

Update: 2020-04-25 17:06 GMT
World Health Organization (WHO)

COVID-19 నుండి కోలుకున్న వారికీ మరోసారి మహమ్మారి ముప్పు లేదనడానికి ప్రస్తుతం ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శనివారం తెలిపింది. కరోనా సోకిన వ్యక్తులకు 'రోగనిరోధక శక్తి పాస్‌పోర్ట్‌లు' లేదా 'రిస్క్-ఫ్రీ సర్టిఫికెట్లు' ఇవ్వడంపై ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నిర్ణయాలతో వైరస్‌ మరింత విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,822,003 కేసులు నమోదయ్యాయని, మొత్తం 1,97,578 మరణాలు సంభవించాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ట్రాకర్ శనివారం తెలిపింది. ఇక భారత్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి 25వేల మార్క్ ని దాటింది. 


Tags:    

Similar News