Nigeria floods: ఆ ఊరంతా శ్మశానంగా మారిపోయింది.. 700 మంది ఎలా జలసమాధి అయ్యారు?

Nigeria floods: ఆఫ్రికా ఖండంలో ఓ చిన్న పట్టణముంది. అది నైజీరియాలోని మోక్వా. అక్కడ జరిగిన ఒక విషాద కథ కన్నీరు తెప్పిస్తోంది. మోక్వా ప్రాంతం కొద్ది రోజులుగా ఒక భారీ విషాదం మధ్యలో మునిగిపోయింది.

Update: 2025-06-04 03:55 GMT

Nigeria floods: ఆ ఊరంతా శ్మశానంగా మారిపోయింది.. 700 మంది ఎలా జలసమాధి అయ్యారు?

Nigeria floods: ఆఫ్రికా ఖండంలో ఓ చిన్న పట్టణముంది. అది నైజీరియాలోని మోక్వా. అక్కడ జరిగిన ఒక విషాద కథ కన్నీరు తెప్పిస్తోంది. మోక్వా ప్రాంతం కొద్ది రోజులుగా ఒక భారీ విషాదం మధ్యలో మునిగిపోయింది. ప్రాణాలతో నిండిన నగరాలు... ఇప్పుడు శ్మశానాలను తలపిస్తున్నాయి. సాధారణంగా రైతులూ, వ్యాపారులూ, ప్రజలూ నిత్యం రద్దీగా సంచరించే ప్రాంతమది. పంటలు అమ్ముకోవడానికి రైతులు గుంపులుగా అక్కడికి వచ్చేవారు. ఆ ఊరు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. శవాల మట్టివాసన, ఏడుపుల ఆర్తనాదాలు... అంతే కాదు, విరహ వేదనతో తల్లులు, భార్యలు, చిన్నారులు... ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకే తెలియని దుస్థితి.

ఒకే ఒక్క రోజులో... కుండపోత వర్షాలు వచ్చాయి. కొద్ది గంటల వ్యవధిలోనే బురద, నీరు, ధ్వంసం.. ఇవన్నీ కలగలిపి మోక్వా పట్టణాన్ని మింగేశాయి. జనాలు ఊహించని విధంగా, ఒక్కసారిగా వచ్చిన వరద గంటల వ్యవధిలోనే ఊరు మొత్తం ముంచెత్తింది. ఎంతో మంది ప్రాణాలను హరించివేసింది. ఇప్పటివరకు కనుగొన్న మృతదేహాల సంఖ్య 700. కానీ అక్కడితో ఆ సంఖ్య ముగిసిపోయేది కాదు. ఇంకా 500 మందికి పైగా కనిపించకుండా పోయారు. అధికారుల అంచనా ప్రకారం... వాళ్లలో ఒక్కరు కూడా బతికే అవకాశమే లేదు. ఇక సహాయక చర్యలు కూడా ఆపేశారు.అంతే కాదు... పట్టణానికి హెల్త్ సెంటర్‌కు వెళ్లే రోడ్లు, బ్రిడ్జీలు అన్నీ కొట్టుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లను వరదలు మింగేశాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎవ్వరికీ రక్షణ లేదు.

ఇలా ఒక జలప్రళయం... ఒక పట్టణాన్ని ఇలా మింగేయడం చూస్తే మనం మన దేశంలో ఎదుర్కొంటున్న ముప్పులపై మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయమిది. వాతావరణ మార్పులు... ప్రకృతి ఆగ్రహం... ఇవన్నీ మన దృష్టికి తెస్తున్న సంకేతాలే. ఇవి ఎక్కడెక్కడో జరుగుతున్నాయని నిర్లక్ష్యం చేస్తే... రేపు మన దగ్గరే జరగవచ్చు. ఈ విషాద ఘటనతో మళ్లీ మనం మానవ జీవిత విలువను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో తెలియజేస్తోంది. మోక్వా పట్టణం ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తోంది. మానవతా స్ఫూర్తి అక్కరైన కాలం ఇది. ప్రకృతి ఎదుట మనం ఎంత బలహీనులమో, ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్లు లేకపోతే ఎలాంటి విపత్తులు ఎదురవుతాయో..ఈ నైజీరియా వరదలు మరోసారి మనకు గట్టిగా గుర్తు చేస్తున్నాయి. ఇకనైనా జాగ్రత్త పడదాం.

Tags:    

Similar News