NewZealand:లాక్ డౌన్ ఎత్తేసిన న్యూజిలాండ్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నుంచి సమర్థవంతంగా ఎదురుకొని విజయవంతం అయ్యామని న్యూజిలాండ్ ప్రధాని జకిండా అర్డెర్న్ అన్నారు.

Update: 2020-04-28 09:21 GMT
Jacinda Ardern (File Photo)

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నుంచి సమర్థవంతంగా ఎదురుకొని విజయవంతం అయ్యామని న్యూజిలాండ్ ప్రధాని జకిండా అర్డెర్న్ అన్నారు. అంతేకాకుండా సోమవారం అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌లో వైరస్‌ను వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నాము. అంటే మనం యుద్ధంలో గెలిచాము. కానీ, మనం దాన్ని తరిమికొట్టాలంటే మరింత అప్రమత్తంగా ఉండాలి అని పేర్కొన్నారు. న్యూజిలాండ్ లో నాలుగు వారాలకు పైగా ఉన్న లెవల్ -4 లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీనితో నేటినుంచి పాఠశాలలతో పాటు దాదాపు అన్ని వ్యాపారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఆ దేశంలో ఇప్పటివరకు 1,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19మంది మృతి చెందారు.


Tags:    

Similar News