New Zealand welcomes 2025: అక్కడ అన్ని దేశాలకంటే ముందే న్యూ ఇయర్ వచ్చేసింది
Image and video Courtesy: Screengrabs from X user, Colton Blake
New Zealand becomes first country in the world to welcome new year 2025: న్యూజిలాండ్‌లో అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూజిలాండ్‌లో డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలయి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడంతో అక్కడి ప్రజలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2025 కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉన్న స్కై టవర్ న్యూ ఇయర్ వేడుకలకు వేదికగా నిలిచింది.
ఆకాశాన్ని తాకినట్లుగా ఉండే స్కై టవర్ చుట్టూ మిరుమిట్లు గొలిపే తారాజువ్వల మధ్య చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు అన్నట్లుగా న్యూజిలాండ్ న్యూ ఇయర్ సంబరాలు కనిపించాయి. ఆ ఫైర్‌వర్క్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పండగలైనా, ఇతర ఉత్సవాలైనా ఇక్కడి ప్రజలు ఈ స్కై టవర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఇక్కడే అంతా కలిసి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవాళ కూడా న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్ కోసం భారీ సంఖ్యలో జనం గుమిగూడి సంబరాలు చేసుకున్నారు.