New Year 2022: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

New Year 2022: బాణసంచా వెలుగులతో గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన కివీస్‌ ప్రజలు...

Update: 2022-01-01 03:30 GMT

New Year 2022: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

New Year 2022: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. అందరికంటే ముందే న్యూజిలాండ్ ఆక్లాండ్ వాసులు న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పారు. మధుర జ్ఞాపకాలను మదిలో దాచుకుంటూ 2021కి గుడ్‌బై చెప్పిన ఆక్లాండ్ వాసులు.. కోటి ఆశలతో ప్రపంచంలోనే అందరికంటే ముందే 2022కి స్వాగతం పలికారు. వీరితోపాటు పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా, టోంటా, కిరిబాటి దీవుల్లో నూతన సంవత్సర వేడుకల సందడికి శ్రీకారం చుట్టారు.

దాదాపు గంట తర్వాత న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాదిని ఆహ్వానించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. మరోవైపు.. భారత్ కంటే ఐదున్నర గంటల ముందుగా ఆస్ట్రేలియా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకల అంబరాన్నంటేలా జరుపుకుంటారు. జపాన్ సైతం మనకంటే మూడు గంటలు ముందే 2022లోకి అడుగుపెట్టింది.

ఇదే సమయంలో న్యూజిలాండ్ ఛాధమ్ దీవులు, రాజధాని అక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో అక్కడి ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద సంఖ్యలో క్రాకర్స్ కాల్చి సందడి చేశారు. పరస్పరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ అక్లాండ్ వాసులు ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.

ఇలా వరుసగా ప్రపంచంలోనే తొలుత అక్లాండ్‌లో కొత్త ఏడాది 2022 వచ్చింది. ఆ తర్వాత న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పిన వాటిలో సిడ్నీ, టోక్యో, బీజింగ్-హాంగ్‌కాంగ్, దుబాయి, ప్యారిస్-రోమ్-బ్రసెల్స్, లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లలో కొత్త ఏడాది ప్రారంభమైంది.

Tags:    

Similar News