Shahbaz Sharif: నీ కాపీ బతుకు తగలెయ్యా.. మోదీని మక్కీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాక్ ప్రధాని
Shahbaz Sharif: నీ కాపీ బతుకు తగలెయ్యా.. మోదీని మక్కీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాక్ ప్రధాని
Shahbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పత్తాలేకుండా పోయింది. అయినా కూడా దానికి మాత్రం బుద్ధి రావడం లేదు. ప్రగల్భాలు పలుకుతూ మళ్లీ నవ్వులపాలవుతోంది. ఇప్పుడా దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్..భారత ప్రధాని మోదీ చర్యలను కాపీ కొట్టడంతో మీమర్లకు అడ్డంగా దొరికిపోయారు. సియాల్ కోట్ లోని ఆర్మీ బేస్ ను షెహబాజ్ సందర్శించడంపై నెట్టింట్ల విమర్శలు వస్తున్నాయి.
భారత ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపుర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడి సైనికులతో మచ్చటించిన ఆయన ఆపరేషన్ సింధూర్ లో మన దళాల సేవలను కొనియాడారు. అదే సమయంలో దాయాదికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ మరుసటి రోజు అంటే బుధవారం పాక్ ప్రధాని షెహబాజ్..సియాల్ కోట్ లోని పస్పూర్ కంటోన్మెంట్ ను సందర్శించారు. భారత దాడుల్లో ధ్వంసమైన తమ ఆర్మీ స్థావరాన్ని పరిశీలించారు.
దీనికి సంబంధించి ద్రుశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో షెహబాజ్ పై జోకుల మీద జోకులు పేలుతున్నాయి. అచ్చం మోదీని కాపీ కొట్టారంటూ పలువురు నెటిజన్లు వ్యంగంగా కామెంట్స్ చేస్తున్నారు. భారత్ చేతిలో ఓడిపోయినా..పాకిస్తాన్ సంబురాలు చేసుకుంటోంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఓడిపోతే కూడా స్వీట్లు పంచుతారా అంటూ చురకలంటిస్తున్నారు.
ఇక పాకిస్తాన్ భారత్ ను కాపీ చేయడం ఇదే మొదటిసారి కాదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్న సమయంలో న్యూఢిల్లీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ జాతీయులకు వీసాల రద్దు, ఆ దేశ హైకమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బంది తగ్గింపు, అటారీ సరిహద్దును మూసివేయడం వంటివి ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్ కూడా అలాంటి చర్యలనే ప్రకటించింది. దీంతో అప్పట్లోనూ పాక్ పై ట్రోల్స్ పేలిపోయాయి.