Nepal floods: వరదల్లో కొట్టుకుపోయిన..నేపాల్, చైనా సరిహద్దు వంతెన
Nepal floods: రుతుపవనాలు రాకతో చాలా దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు ఉప్పొంగుతున్నాయి. నేపాల్, చైనా సరిహద్దులో కూడా భీకరంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Nepal floods: వరదల్లో కొట్టుకుపోయిన..నేపాల్, చైనా సరిహద్దు వంతెన
Nepal floods: రుతుపవనాలు రాకతో చాలా దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు ఉప్పొంగుతున్నాయి. నేపాల్, చైనా సరిహద్దులో కూడా భీకరంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీరు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ వరదల్లో నేపాల్, చైనా సరిహద్దుగా ఉన్న మైత్రి వంతెన భోటేకోషి నదిలో కొట్టుకుపోయింది. వివరాల్లోకి వెళితే..
రుతుపవనాల కారణంగా నేపాల్‌లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. నదులు భయంకరంగా ఉప్పొంగుతున్నాయి. దీంతో నేపాల్ లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. ఇళ్లు, చెట్లు కొట్టుకుపోతున్నాయి. నేపాల్, చైనా సరిహద్దు మైత్రి వంతెన భోటేకోషి కూడా వరదలో కొట్టుకపోయింది.
నేపాల్ గత కొన్ని రోజులుగా వరద భీభత్సాన్ని సృష్టిస్తుంది. ఈ వరదలో ఇప్పటివరకు 12 మంది నేపాలీలు, 6 మంది చైనీయులు గల్లంతైనట్లు సమాచారం. ఖాట్మండు నుండి 120 కిమీ దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దులో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక మరోపక్క గల్లంతయ్యారిని రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.