Elon Musk : డోనాల్డ్ ట్రంప్‌తో.. మస్క్ ఇంట‌ర్వ్యూ..సైబ‌ర్ దాడి జ‌రిగింద‌ంటూ

Elon Musk:ఎలన్ మస్క్, ట్రంప్ ఇంటర్వ్యూ ప్రసారంపై సైబర్ అటాక్ జరిగింది. డీడీఓఎస్ దాడి జరిగినట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. దీంతో యూజర్లంతా ఆ ఇంటర్వ్యూను యాక్సెస్ చేయలేపోయినట్లు మస్క్ తెలిపారు.

Update: 2024-08-13 05:50 GMT

Elon Musk:డోనాల్డ్ ట్రంప్‌తో.. మస్క్ ఇంట‌ర్వ్యూ..సైబ‌ర్ దాడి జ‌రిగింద‌ంటూ

 Elon Musk: టెస్లా అధినేత.. బిలియనీర్, ట్విట్టర్ ఈసీవో ఎలోన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేశారు ఈ ఇంటర్వ్యూలో ఇటీవలి హత్యాయత్నం గురించి బహిరంగంగా మాట్లాడారు. అయితే ఈ ఇంటర్వ్యూ ప్రసారాలకు టెక్నికల్ సమస్యలు వచ్చాయి. తమ ఇంటర్వ్యూ సందర్బంగా సైబర్ దాడి జరిగినట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. ఇద్దరి మధ్య చాలా సుదర్ఘమైన చర్చ సాగింది. కానీ ఆ షో 40 నిమిషాలు ఆలస్యంగా షురూ అయ్యింది. ఎక్స్ యూజర్లు ఆ ఇంటర్వ్యూను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తమపై డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్ జరిగినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు.తమ డేటా లైన్లు అన్నీ నిర్వీర్యం అయినట్లు పేర్కొన్నారు. 2గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. రిపబ్లికన్ ప్రచారానికి మద్దతు పలకాలని ఆయన ఓటర్లను కోరారు. ట్విట్టర్ అకౌంట్ పై డీడీఓఎస్ దాడులకు జరిగాయని..దాని వల్లే వెబ్ సైట్ ఓవర్ లోడ్ అవుతుందని..దాంతో సైట్ యాక్సెస్ లో ఇబ్బందులు తలెత్తాయని మస్క్ తెలిపారు. సైబర్ దాడి జరిగిందంటే..ట్రంప్ కు వ్యతిరేకత ఉందని అర్ధమవుతుందని చెప్పారు. డీడఓఎస్ దాడి వల్ల ఒక్కసారిగా భారీ సంఖ్యలో సిగ్నల్స్ వస్తాయని..దీంతో ఆ లైన్ డిస్టర్బ్ అవుతుందని సింగపూర్ సైబర్ స్పేస్ డైరెక్టర్ ఆంథోనీ లిమ్ తెలిపారు.

గతంలో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ జో బిడెన్‌కు మద్దతు ఇచ్చిన ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్రంప్‌కు తన మద్దతును అందించారు. ఇది ట్రంప్ ప్రచారానికి మద్దతుగా సూపర్ PACని కూడా ప్రారంభించింది. మస్క్ మద్దతు తర్వాత, ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ట్రంప్‌కు తన సాంప్రదాయ స్థావరానికి మించి విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి అవకాశం కల్పించింది. గత నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం సందర్భంగా పిడికిలి బిగించి చూపిన ఉత్సాహం అభినందనీయం కాబట్టే ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు తాను మద్దతిచ్చానని మస్క్ తెలిపారు.

సోమవారం రాత్రి 8:42 గంటలకు ఎక్స్ లో ట్రంప్‌తో లైవ్ స్ట్రీమ్ సంభాషణను మస్క్ ప్రారంభించారు..కానీ సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైంది. ముందుగా ఈ కార్యక్రమం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. సైబర్ దాడి వల్లే చర్చల్లో జాప్యం జరిగిందని మస్క్ చెప్పారు. డిస్ట్రిబ్యూటెడ్ డినయల్-ఆఫ్-సర్వీస్ (DDoS) దాడి వల్ల ఆలస్యానికి కారణమని మస్క్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News