ఇంతమంది పిల్లలా? పేర్లు గుర్తుపెట్టుకోవడానికి రిజిస్టర్ మేయింటేన్‌ చేయాలేమో!

Update: 2024-12-26 14:06 GMT

Musa Hasahya Kasera, Uganda man with 12 wives: తూర్పు ఉగాండాలోని ముకిజా గ్రామానికి చెందిన ముసా హాసహ్యా కసేరా.. తన సంతానోత్పత్తి ద్వారా చిన్నపాటి గ్రామాన్నే నిర్మించాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారి ద్వారా 102 మంది సంతానాన్ని పొందాడు. వారికి పెళ్లిళ్లు చేయడం ద్వారా మొత్తంగా 578 మందికి తాతయ్యాడు.

ప్రస్తుత రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఆ వ్యక్తి మాత్రం ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. ముకిజా గ్రామానికి చెందిన ముసా హసహ్యా కసేరా ప్రస్తుత వయస్సు 70 ఏళ్లు. 12 మందిని పెళ్లి చేసుకుని వారి ద్వారా 102 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. ఒక్కో భార్య నుంచి 8, 9 మంది పిల్లల్ని కన్నాడు. 1972 లో ముసా తొలి వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయస్సు 17 ఏళ్లు. అనంతరం ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన సంతానాన్ని పోషించేందుకు నానా పాట్లు పడుతున్నాడు.

అయితే ఇంతమందికి జన్మనిస్తూ పోయినా వారిని ఎలా పోషించగలనన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదంటున్నారు ముసా. కానీ కుటుంబం పెద్ది కావడంతో ఇప్పుడు కసేరా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఒకప్పుడు తన కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుందని భావించిన అతని రెండెకరాల భూమి ఇప్పుడు ఆ కుటుంబం ఆకలి తీర్చలేకపోతుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఇళ్లల్లో పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు.

ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కాలినడకనే ప్రయాణిస్తామని చెబుతున్నారు. అందరం కలిసి భోజనం చేస్తుంటామని చెప్పుకొచ్చారు. అయితే కొన్నిసార్లు ఆహారం సరిపోదని.. ఆ సమయంలో రోజుకు రెండు సార్లు మాత్రమే తింటామని హసహ్య మూడో భార్య జబీనా చెప్పింది. ఏదేమైనా తన కుటుంబమంతా తనను ప్రేమిస్తారంటూ హసహ్య తెలిపారు. ది ఇండోట్రెక్కర్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News