Miss World 2023 in India: మూడు దశాబ్దాల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు

Miss World 2023 in India: 1996లో ఇండియాలో చివరిసారి జరిగిన అందాల పోటీలు

Update: 2023-06-09 05:34 GMT

Miss World 2023 in India: మూడు దశాబ్దాల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు

Miss World 2023 in India: మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ సుందరాంగిని ఎన్నుకునే ఈ పోటీలకు విశ్వవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై అందరి దృష్టి ఉంటుంది. ఈ పోటీలను నిర్వహించే అవకాశం అన్ని దేశాలకు రాదు. కానీ, ఈ ఏడాది మన దేశానికి ఆ అవకాశం వచ్చింది. 2023 - మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరగబోతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలను నిర్వహించే అవకాశం మన దేశానికి దక్కింది. 71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలో నవంబర్‌లో జరుగనున్నాయి. చివరిసారి ఇండియాలో 1996లో అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు జరిగాయి.

Tags:    

Similar News