Microsoft: కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి

Microsoft: విండోస్‌ ప్రింట్‌ స్పూలర్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తింపు *హ్యాకర్లు డేటా చోరికి పాల్పడే అవకాశం ఉంది

Update: 2021-07-09 04:06 GMT

మైక్రోసాఫ్ట్ (ఫైల్ ఇమేజ్)

Microsoft: విండోస్‌ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని మైక్రోసాప్ట్‌ కోరింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దాన్ని నివారించేందుక ఓ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది.

ఒకే ప్రింటర్‌ను ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ప్రింట్‌ స్పూలర్‌ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్‌ఫర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్‌ చేయొచ్చన్న వివరాలను పొరపాటున ఆన్‌లైన్‌ వీడియో విడుదల చేశారు. అయితే వెంటనే డిలీట్‌ చేసినప్పటికీ.. ఆలోపే కొన్ని డెవలపర్‌ సైట్లలోకి సదురు సమాచారం అందింది.

ఇక ప్రింట్‌నైట్‌మేర్‌గా పిలుస్తున్న ఈలోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్‌లను ఇతరుల కంప్యూటర్లలో ఇన్‌స్టాల్‌ చేసే ముప్పుందని మైక్రోసాప్ట్‌ హెచ్చరించింది. ఫలితంగా కంప్యూటర్లపై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ వస్తుందని పేర్కొంది. విండోస్‌-10తోపాటు విండోస్‌-7లోనూ ఈ లోపం ఉందని వినియోగదారులకు తెలియజేసింది. అప్‌డేట్‌లను విడుదల చేసింది. బయటపడ్డ లోపాలనూ అధిగమించేలా తీర్చిదిద్దినట్లు తెలిపింది.

Full View


Tags:    

Similar News