Mark Carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
Mark Carney: కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Mark Carney: కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ట్రూడో రాజీనామాతో ఎన్నిక అనివార్యమైన వేళ.. ఫ్రీలాండ్‌ను ఓడించి అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడగా... ప్రధానిగా కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు.
కెనడాలో ప్రధాని అభ్యర్థిత్వంపై జరిగిన పోటీలో నలుగురు కీలక నేతలు పాల్గొన్నారు. మొత్తం లక్షా 50 వేల మంది ఓటర్లు ఎన్నికలో పాల్గొనగా.. కార్నీకు మద్దతుగా లక్షా 31 వేల మంది నిలిచారు. ఫ్రీలాండ్‌కు 11 వేల ఓట్లు, కరినా గౌల్డ్‌కు 4 వేల 7 వందలు.. ఫ్రాంక్ బేలిస్‌కు నాలుగు వేల ఓట్లు పోలయ్యాయి.