Malaysia Helicopter Crash: మలేషియాలోని పులాయ్ నదిలో కూలిపోయిన పోలీస్ హెలికాప్టర్
Malaysia Helicopter Crash: మలేషియాలోని జోహోర్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ సందర్భంగా ఓ పోలీస్ హెలికాప్టర్ నదిలో కూలిపోవడంతో ఐదుగురు గాయపడినట్టు తెలుస్తోంది.
Malaysia Helicopter Crash: మలేషియాలోని పులాయ్ నదిలో కూలిపోయిన పోలీస్ హెలికాప్టర్
Malaysia Helicopter Crash: మలేషియాలోని జోహోర్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ సందర్భంగా ఓ పోలీస్ హెలికాప్టర్ నదిలో కూలిపోవడంతో ఐదుగురు గాయపడినట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన జోహోర్ state's పులాయ్ నదిలో చోటుచేసుకుంది. మలేషియా ఎయిర్ బస్ AS 355 N హెలికాప్టర్ తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి, గెలాంగ్ పాటాలోని మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (MMEA) జెట్టీ సమీపానికి చేరుకున్న వెంటనే ఆకాశం నుంచి నేరుగా నదిలో కూలిపోయింది.
దీనిపై మలేషియా పౌర విమానయాన శాఖ స్పందిస్తూ… “మాక్ డ్రిల్” సమయంలో ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. ఈ డ్రిల్ మిత్సతోమ్ 2025 పేరుతో మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న అణు భద్రతా కసరత్తులో భాగంగా జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీములు స్పందించి పైలట్‌తో సహా ఐదుగురిని రక్షించాయి. సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఈ హెలికాప్టర్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార వర్గాలు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించాయి.