Mahatma Gandhi photos: రష్యాలో బీరు క్యాన్లపై మహాత్మా గాంధీ ఫోటోలు... కంపెనీపై నెటిజెన్స్ ఆగ్రహం

Update: 2025-02-15 15:29 GMT

Mahatma Gandhi photos: రష్యాలో బీరు క్యాన్లపై మహాత్మా గాంధీ ఫోటోలు... కంపెనీపై నెటిజెన్స్ ఆగ్రహం

Mahatma Gandhi photos on Russian Beer Cans: రష్యాలో బీర్ క్యాన్స్‌పై భారత జాతిపిత మహాత్మాగాంధీ ఫోటోలు ముద్రించిన ఘటన వివాదాస్పదమైంది. రష్యాలో రివోర్ట్ అనే ఆల్కహాల్ కంపెనీ బీర్ క్యాన్లపై గాంధీ ఫోటోలు కనిపించాయి. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు, రాజకీయ నాయకుడైన సుపర్నో సత్పతి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యవహారంపై రష్యాతో మాట్లాడాల్సిందిగా ప్రధాని మోదీని కోరుతూ సత్పతి ఈ ఫోటోలు షేర్ చేశారు.

ఈ ఫోటోలను గమనిస్తే... కేవలం గాంధీ ఫోటోలను వాడటమే కాదు, బీర్ పేరు కూడా మహాత్మా జి అని ముద్రించారు. పైన రివోర్ట్ అని బ్రాండ్ పేరు రాసి ఉంది. ఆ మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో మహాత్మా గాంధీ సంతకాన్ని ముద్రించారు. మొత్తంగా గాంధీ ఫోటో, పేరు, ఆటోగ్రాఫ్ ముద్రించారు.


సత్పతి ఈ ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోదీని, రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌ను కూడా ట్యాగ్ చేశారు.

బీర్ క్యాన్లపై గాంధీ ఫోటోలు చూసి ఇండియన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. "బీర్ బ్రాండ్‌తో, బీరుతో మహాత్మా గాంధీకి అసలు ఏం సంబంధం" అని మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ అయింది. 

రష్యాకు, భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని వేరేగా చెప్పనక్కర్లేదు. గతేడాది చివర్లోనే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లి వచ్చారు. మోదీ రష్యా పర్యటనలోనూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ రష్యా, భారత్ మధ్య ఉన్న స్నేహ సంబంధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి ఇప్పుడు భారత్‌ను అవమానించేలా భారత జాతి పిత ఫోటోను తమ బీర్ క్యాన్స్‌పై ముద్రించిన రివోర్ట్ కంపెనీపై రష్యా ఏం చర్యలు తీసుకుంటుందోననేది వేచిచూడాల్సిందే. 

WATCH THIS VIDEO -  Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్‌ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?

Full View

Tags:    

Similar News