Wildfire: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఇటీవల చెలరేగిన కార్చిచ్చు మళ్లీ మొదలైంది. తాజాగా మరో ప్రాంతంలో కొత్త మంటలు చెలరేగాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇవి కేవలం కొన్నిగంటల వ్యవధిలోనే 8వేలకు పైగా ఎకరాలకు వ్యాపించినట్లు తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు.
కాస్టాయిక్ లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్దెత్తున మంటలు చెలరేగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్నికీలలు 39 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను, పొదలను బూడిద చేశాయి. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం..ఇటీవల అగ్నికి అహుతైన ఈటన్, పాలిసేడ్స్ కు కేవలం 64కిలోమీరట్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల్లో మంటలు ఇంకా ఆరలేదు. దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి.