Death Penalty: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష

Death Penalty: కువైట్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు భారతీయులకు అక్కడి న్యాయస్థానం అత్యంత కఠినమైన శిక్షను విధించింది.

Update: 2026-01-08 10:48 GMT

Death Penalty: కువైట్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు భారతీయులకు అక్కడి న్యాయస్థానం అత్యంత కఠినమైన శిక్షను విధించింది. భారీ మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడిన వీరికి మరణశిక్ష ఖరారు చేస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

దేశంలో డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించిన కువైట్ ప్రభుత్వం, తాజాగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉండి, కువైట్‌లో భారీగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు వీరిపై ఆరోపణలు రుజువయ్యాయి.

కువైట్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు కైఫాన్‌, షువైఖ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో జరిపిన ఈ దాడుల్లో ఇద్దరు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 14 కిలోల హెరాయిన్‌, 8 కిలోల మెథాంఫెటమైన్‌ (ఐస్ డ్రగ్) స్వాధీనం చేసుకున్నారు.

నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ప్రాసిక్యూటర్లు కోర్టులో పక్కా ఆధారాలు సమర్పించారు. నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నిందితులిద్దరినీ దోషులుగా తేల్చుతూ మరణశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఇద్దరు భారతీయులు ఏ రాష్ట్రానికి చెందిన వారు, వారి పూర్తి వివరాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. భారత రాయబార కార్యాలయం ఈ విషయంపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉంది.

Tags:    

Similar News