మమ్మల్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం: కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వార్నింగ్

Kim Yo Jong: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యోజోంగ్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు.

Update: 2025-03-04 06:46 GMT

మమ్మల్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం: కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వార్నింగ్

Kim Yo Jong: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యోజోంగ్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే యో జోంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియా- అమెరికా సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో ఉద్రిక్తత నెలకొంది.

అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే తమను రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసిందని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఈ చర్యలకు ధీటుగా స్పందిస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికా చర్యలు ఉన్మాదానికి ప్రతీక అని ప్రతిస్పందిస్తామని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది.

అణ్వాయుధ పరీక్షలను మరింత ముమ్మరం చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది. ఏవైనా రెచ్చగొట్టే చర్యలను తిప్పికొట్టడానికి సిద్దంగా ఉందని వార్నింగ్ ఇచ్చింది నార్త్ కొరియా. క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా నిర్వహించిన నాలుగు రోజుల తర్వాత యుఎస్ క్యారియర్ మోహరించింది. ఇది ఈ ఏడాది నాలుగవ క్షిపణి పరీక్ష.

అమెరికా కవ్వింపు చర్యలతో ఆందోళన చెందుతున్నాం. ఇది కొరియా ద్వీపకల్పం చుట్టుపక్కల తీవ్రమైన సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం ఉందని ఉత్తర కొరియా చెబుతోంది. ఇలాంటి కవ్వింపు చర్యలకు చట్టబద్దమైన హక్కును కచ్చితంగా తీసుకుంటామని ఉత్తర కొరియా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News