Dengue Vaccine: త్వరలో భారత్‌లో డెంగ్యూ కి టీకా?

*జపాన్ కంపెనీ 'తకేడా' ప్రయాత్నాలు *డీసీజీఐతో 'తకేడా' ఫార్మా కంపెనీ సంప్రదింపులు *ప్రయోగాల దశలో దేశీయ కంపెనీలు

Update: 2021-10-18 04:20 GMT

 డెంగ్యూ టీకా(ఫైల్ ఫోటో)

Dengue Vaccine: డెంగ్యూ టీకాకు సంబంధించిన పరిశోధనలు ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయి. ప్రాణాంతకమైన పలు వ్యాధులకు నేటికీ వ్యాక్సిన్‌న్లు లేకపోవడం జీర్ణించుకోలేని వాస్తవం. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులకు ఇప్పటివరకు టీకా రాలేదు. క్యాన్సర్ లాంటి వాటికి నేటికి సరైన చికిత్స లేదు. అయితే డెంగ్యూ వ్యాక్సిన్ విషయంలో కీలక ముందడుగు పడినట్లు జపాన్‌కు చెందిన 'తకేడా' ఫార్మా చెబుతోంది.

డెంగ్యూ జ్వరానికి మన దేశంలోనూ తొలిసారి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కినిపిస్తున్నాయి. జపాన్‌కు చెందిన 'తకేడా' ఫార్మా తాను అభివృద్ధి చేసిన టీకాను మన దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే DCGIతో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. ఇక దీనికి సానుకూల స్పందన లభిస్తే టీకా అందుబాటులోకి తీసుకురావడానికి 'తకేడా' ఫార్మా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

డెంగ్యూకి 'టక్-003' టీకాను తకేడా ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసింది. దీనికి అనుమతివ్వాలని ఇప్పటికే పలు యూరప్ దేశాల్లో దరఖాస్తు చేసింది. అదే సమయంలో వివిధ ఆసియా దేశాల్లో ఈ టీకా విక్రయానికి ప్రయత్నిస్తోంది. తకేడా ఫార్మా ప్రపంచవ్యాప్తంగా 20 పెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటి. క్యాన్సర్, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ లాంటి మెడిసిన్స్‌తో పాటు కొన్ని అరుదైన వ్యాధులకు మందులు ఆవిష్కరించిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది.

ఇదిలా ఉంటే తకేడా కంపెనీతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన 'సనోఫీ' అనే సంస్థ కూడా మన దేశంలో DCGI అనుమతి తీసుకునేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈలోపు తకేడా ఫార్మా ముందుకొచ్చింది. మన దేశంలో పరిమితంగానైనా క్లినికల్ పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా డెంగ్యూ టీకాకు అనుమతి సంపాదించాలని తకేడా ఫర్మా భావిస్తోందని సమాచారం. ఈ ప్రయత్నాలు ఫలిస్తే మన దేశంలోకి డెంగ్యూ టీకా అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. 

Tags:    

Similar News