Donald Trump: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేయడం మంచిదే..ఆ దేశానికి అదే జరగాలి.. డోనాల్డ్ ట్రంప్

Donald Trump: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఒకదేశంపై మరొక దేశం ఆపరేషన్ల పేరుతో క్షిపణి దాడులు జరుపుతున్నాయి. ఇటీవల ఇరాన్‌లోని టెహ్రాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయిల్ దాడులు జరిపింది.

Update: 2025-06-14 06:25 GMT

US Military Strike: ఇరాన్ లో టెన్షన్ టెన్షన్..యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా..ఏ క్షణమైనా దాడి?

Donald Trump: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఒకదేశంపై మరొక దేశం ఆపరేషన్ల పేరుతో క్షిపణి దాడులు జరుపుతున్నాయి. ఇటీవల ఇరాన్‌లోని టెహ్రాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు తీవ్ర నష్టం జరిగింది. అయితే ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేయడం సరైనదేనని, ఇరాన్‌కు ఇది జరగాల్సిందేనని అన్నారు. అంతేకాదు ఈ దాడులు జరుగుతాయని తనకు ముందే తెలుసునని, అందుకే ఇరాన్‌కు న్యూక్లియర్ డీల్ చేసుకునేందుకు సరైన సమయం ఇచ్చామని చెప్పారు. కానీ ఇరాన్ ఆ మాటలను పెడచెవిన పెట్టి ఇజ్రాయిల్‌పై దాడులకు దిగుతుందని.. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తుందని అన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేయడం మంచిదేనని వ్యాఖ్యానించారు.

గతవారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ ఇరాన్‌పై జరిపిన దాడిలో టెహ్రాన్ ఎయిర్ పోర్ట్‌తో పాటు అణుస్థావరాలు, ఆర్మీ బేస్‌లను ఇరాన్ పోగొట్టుకుంది. అంతేకాదు ఈ దాడుల్లో ఇరాన్ ప్రముఖ నాయకులను కూడా కోల్పోయినట్టు సమాచారం.

ఇదిలాఉంటే ఈ యుద్ధం జరగక ముందు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకోమని ఇరాన్‌ను కోరారు. అయితే ఇరాన్ దానికి అంగీకరించలేదు. దీంతో ఇజ్రాయిల్ ఇరాన్‌పై వైమానిక దాడులు జరపడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్‌కు అణు ఒప్పందం కోసం 60 రోజులు గడువు ఇచ్చామని, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఒప్పందం సంతకం చేయొచ్చని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. లేదంటే ఇజ్రాయిల్ చేతిలో ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోతుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. 

Tags:    

Similar News