Iran-Israel War: ఇరాన్‌లో 865 మంది మృతి.. మానవ హక్కుల సంఘం వెల్లడి..అసలు దాడుల్లో ఎంతమంది చనిపోతున్నారు? నిజాలు ఎందుకు బయటకు రావడంలేదు?
Iran-Israel War: కొన్నేళ్లుగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య నడుస్తోన్న పోరు ఒక్కసారిగా యుద్ధంగా మారిపోయింది. ఈ యుద్దంలో ఇప్పటివరకూ వేల మంది చనిపోయారు. వేల మంది గాయపడ్డారు.
Iran-Israel War: ఇరాన్‌లో 865 మంది మృతి.. మానవ హక్కుల సంఘం వెల్లడి..అసలు దాడుల్లో ఎంతమంది చనిపోతున్నారు? నిజాలు ఎందుకు బయటకు రావడంలేదు?
Iran-Israel War: కొన్నేళ్లుగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య నడుస్తోన్న పోరు ఒక్కసారిగా యుద్ధంగా మారిపోయింది. ఈ యుద్దంలో ఇప్పటివరకూ వేల మంది చనిపోయారు. వేల మంది గాయపడ్డారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇదిలాఉంటే ఇటీవల ఇజ్రాయిల్, ఆమెరికా కలిసి ఇరాన్‌లో ఆయిల్, అణ్వాయుధ కేంద్రాలు, సైనిక స్థావరాలపై జరిపిన దాడుల్లో 865 మంది చనిపోయినట్లు, 3వేల మందికి పైగా గాయపడినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. విచిత్రం ఏంటంటే ఇది కొన్ని లెక్కల ప్రకారమే. కానీ ఇంకా లెక్కించని, లెక్కకు రానీ మరణాలెన్నో.
గత కొన్ని రోజులుగా ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులు జరుపుతోంది. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడుల్లో ఎంతోమంది ఇరాన్ సైనికులతో పాటు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితర్వాత అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగి.. ఇరాన్‌లోని అణ్వాయుధ స్థావరాలపై దాడులు చేసింది. ఆ దాడులకు అమెరికా అత్యంత శక్తివంతమైన బాంబర్లు, క్షిపణులను ఉపయోగించింది. ఈ దాడులు తర్వాత ఇరాన్‌కు చెందిన మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేసామని వెల్లడించింది. అయితే ఈ దాడుల్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని వెల్లడించలేదు. ఎందుకంటే అమెరికా ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై జరిపిన దాడుల్ల భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్‌లో బుషెకార్ అణు కేంద్రంపై జరిగిన దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తవచ్చని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ హెచ్చరించారు. ఆ ఫ్లాంట్‌లో వేల కేజీల అణు పదార్ధం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందల కిలోమీటర్ల పరిధికి విస్తరించే ప్రమాదం ఉందని తెలిపింది. ఇదేగనక జరిగి ఉంటే అక్కడ ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది గాయపడి ఉంటారన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
మరోవైపు ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జరుపుతున్న దాడుల్లో ఇటీవల ఒకరోజులో 34 మంది చనిపోయినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. అయితే ఇజ్రాయిల్‌లో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయి ఉంటారన్న కచ్చితమైన సమాచారాన్ని ఇటు ఇజ్రాయిల్‌గానీ, అటు ఇరాన్ గానీ వెల్లడించకపోవడం విశేషం. అసలు ఎందుకు ఈ రెండు దేశాలు స్పష్టమైన మరణాల సంఖ్యను వెల్లడించడం లేదు అనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కని విషయం.