ఇజ్రాయిల్ ప్రధానికి సొంత దేశంలో పెరుగుతోన్న పోరు..అయోమయంలో పడ్డ నేతాన్యాహు
ఒక పక్క ఇరాన్‌తో భీకర యుద్ధం జరుగుతుంటే మరోపక్క తన కొడుకు పెళ్లి ఆపి దేశ ప్రజల కోసం త్యాగం చేసానంటూ ఆ దేశ ప్రధాని నెతాన్యహు అన్నారు. అయితే దీనిపై ఆ దేశప్రజలే నెతాన్యహుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఒక పక్క ఇరాన్‌తో భీకర యుద్ధం జరుగుతుంటే మరోపక్క తన కొడుకు పెళ్లి ఆపి దేశ ప్రజల కోసం త్యాగం చేసానంటూ ఆ దేశ ప్రధాని నెతాన్యహు అన్నారు. అయితే దీనిపై ఆ దేశప్రజలే నెతాన్యహుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ వివరాల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఆ దేశాలే కాకుండా ఏకంగా పశ్చిమాసియా దేశాలన్నీ కూడా దాడులతో అట్టుడుకుతున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క ఇజ్రాయిల్ ప్రధాని దేశంలో జరుగుతున్న దాడుల వల్ల తన కొడుకు పెళ్లి రెండు సార్లు వాయిదా వేసానని, ఇలా వాయిదా వేయడం వల్ల తన భార్య, తన కొడుకుకు కాబోయే భార్య ఇద్దరూ కూడా మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. అంతేకాదు, తన కొడుకు పెళ్లి రెండు సార్లు వాయిదా ఇజ్రాయిల్ ప్రజలకోసం తన కుటుంబం త్యాగం చేసిందంటూ నెతాన్యహు వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయిల్‌పై ఇరాన్ జరిపిన దాడులతో దేశమంతా అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఎక్కడ మిస్సైల్ దాడులు జరుగుతాయేమోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. మరెంతోమంది ఈ దాడుల్లో గాయపడ్డారు. ఇదిలా ఉంటే నెతన్యాహు తన కొడుకు పెళ్లిని వాయిదా వేసి త్యాగం చేసానని చెప్పడంతో ఆ దేశప్రజలే నెతన్యాహుపై తీవ్రంగా మండిపడుతున్నారు. నువ్వు చేసింది త్యాగం అయితే.. మేమంతా చేస్తుంది ఏంటి? ఎంతోమంది తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు, మరెంతో గాయపడ్డారు. కానీ వారికి సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. ఇది కదా త్యాగం అంటే ఏదో కొడుకు పెళ్లి ఆపితే అదెలా త్యాగం అవుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఇజ్రాయిల్‌లో దాడులు జరుగుతున్నప్పటి నుంచీ నెతన్యాహు కొడుకు పెళ్లి వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉంది. అయితే అప్పుడు యుద్ధం జరుగుతున్న్పుడు మొదటిసారి వాయిదా వేశారు. ఇప్పుడు రెండోసారి ఇరాన్ తో యుద్ధం జరగుతున్నప్పుడు పెళ్లి జరగాల్సి ఉంది. కానీ మళ్లీ ఇప్పుడు వాయిదా వేశారు.