Israel-Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి వంద రోజులు

Israel-Hamas War: బందీల్లో చాలామంది చనిపోయి ఉండవచ్చన్న పాలస్తీయన్ గ్రూప్

Update: 2024-01-15 16:00 GMT

Israel-Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి వంద రోజులు 

Israel-Hamas War: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కొనసాగుతోంది ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రారంభమై 100 రోజులు ముగిశాయి. ఈ సందర్భంగా పాలస్తీనియన్‌ గ్రూప్‌ హమాస్‌ 37 సెకన్ల నిడివితో ఉన్న ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తమ అధీనంలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీలతో మాట్లాడించింది. వెంటనే తమని విడిపించాలని.. హమాస్‌పై సైనిక చర్యలను నిలిపివేయాలని వారు కోరుతున్నట్లు వీడియోలో ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి. వారి భవితవ్యాన్ని త్వరలో వెల్లడిస్తామని హమాస్‌ తెలిపినట్లు పేర్కొన్నాయి.

తమకు బందీలుగా చిక్కిన వారిలో చాలామంది గాజాలో చనిపోయి ఉండొచ్చని హమాస్‌ అధికార ప్రతినిధి అబు ఒబేదా విడుదల చేసిన మరో సందేశంలో వెల్లడించారు. దీనికి ఇజ్రాయెల్‌ పూర్తి బాధ్యతవహించాలన్నాడు. వారి సైనిక చర్యల వల్లే ఇదంతా జరిగిందని తెలిపారు. ఇప్పటికీ సొరంగాల్లో ఉన్న బందీలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఇజ్రాయెల్‌ దాడులు విస్తరించే కొద్దీ వారు మరింత ప్రమాదంలోకి జారుకుంటారని హెచ్చరించారు.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ సరిహద్దు గ్రామాలపై రాకెట్లతో విరుకుపడిన హమాస్‌.. మొత్తం 240 మందిని బందీలుగా తీసుకున్నది. అయితే ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంలో భాగంగా నవంబర్‌లో కొంతమందిని వదిలేసింది. ఇంకా 132 మంది హమాస్‌ వద్ద బందీలుగానే ఉన్నారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. మరో 25 మంది కాల్పుల్లో మరణించారని తెలిపింది.

Tags:    

Similar News