ఐసిస్ అగ్ర నేత అబుబకర్ అలీ హతమైనట్టు వార్తలు.. భారీ సంఘటన జరిగిందంటూ ట్రంప్ ట్వీట్
ఐసిస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ చీఫ్ బకర్ అల్ బగ్దాదీ హతమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిరియాలో నిన్నటి నుంచి అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఈ భారీ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ దీన్ని బలపరుస్తుంది. ఓ భారీ ఘటన జరిగిందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇవాళ ట్రంప్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
Something very big has just happened!
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019