Afghanistan: ఆప్ఘన్‌లో ఉగ్ర ఘాతుకం, తమ పనేనని ఐఎస్ గ్రూప్‌ ప్రకటన...

Afghanistan: *మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం *రక్తసిక్తంగా మారిన మసీదు ప్రవేశ ద్వారం

Update: 2021-10-09 02:30 GMT

Afghanistan: ఆప్ఘన్‌లో ఉగ్ర ఘాతుకం, తమ పనేనని ఐఎస్ గ్రూప్‌ ప్రకటన...

Afghanistan: ఆప్ఘన్‌లో ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. కుందుజ్‌లోని గొజరే సయ్యద్‌ అబద్‌ మసీదు వద్ద షియాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 143 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రావిన్స్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పేలుడు తీవ్రతకు అక్కడున్నవారు దూరంగా ఎగిరి పడ్డారు. మసీదు ప్రవేశద్వారం, మెట్ల వద్ద అంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రుల హాహాకారాలతో ఆప్రాంతమంతా హృదయవిదాకరంగా మారింది. ఆసుపత్రుల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. షియాల భద్రతకు తాలిబన్లు చర్యలు చేపడుతున్నట్లు తాలిబన్లు చెప్పారు.

ఈ ఘాతుకం తమ పనేనని ఐఎస్‌ గ్రూప్‌ ప్రకటించింది. తాలిబన్లకు బద్ధశత్రువుగా మారిన ఈ ఉగ్రవాద ముఠా.. ఆప్ఘన్‌లో షియా ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ అనేక సార్లు దాడులకు తెగబడుతోంది. మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడటం వారంలో ఇది మూడోసారి కుందుజ్‌లో ఉగ్రదాడిని ఆప్ఘన్‌లోని ఐక్యరాజ్య సమితి మిషన్‌ ఖండించింది.

Tags:    

Similar News