Viral video: లైవ్ లో ఉండగానే దాడి.. బాంబు పడగానే స్టూడియో నుంచి పారిపోయిన యాంకర్..!!

Viral video: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగుతోంది.

Update: 2025-06-17 01:20 GMT

Viral video: లైవ్ లో ఉండగానే దాడి.. బాంబు పడగానే స్టూడియో నుంచి పారిపోయిన యాంకర్..!!

Viral video: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆ దేశ అధికారిక వార్తా ఛానల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) భవనంపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఈ దాడి సమయంలో టీవీ యాంకర్ లైవ్ షో నిర్వహిస్తున్నారు. టీవీ యాంకర్ బాంబు పేలుడు నుండి తృటిలో తప్పించుకున్నారు. బాంబు దాడి సంఘటన టీవీలో రికార్డయింది.

వీడియోలో యాంకర్ వార్తలు చదువుతున్నట్లు చూడవచ్చు. ఈ సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. యాంకర్ కుర్చీలోంచి లేచి పారిపోయింది. స్టూడియోలో శిథిలాలు పడ్డాయి. వెనుక స్క్రీన్ నల్లగా మారింది. స్టూడియో శిథిలాలు, పొగతో నిండిపోయింది. అల్లాహు అక్బర్ అని చెబుతున్న వ్యక్తి గొంతు వినిపిస్తోంది. ఇరానియన్ మీడియా ప్రకారం, ఈ దాడిలో ఇరానియన్ రేడియో, టీవీ ఉద్యోగులు చాలా మంది మరణించారు.ఈ ఘటనతో ఐఆర్ఐబీ తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. టెహ్రాన్ లో టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అంతకు గంటముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఇదెలా ఉండగా ఇరాన్ పై వైమానిక ఆధిపత్యం సాధించామని టెల్ అవీవ్ సోమవారం ప్రకటించింది. పశ్చిమ ఇరాన్ నుంచి రాజధాని టెహ్రాన్ వరకు గగనతలం తమ నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది.



Tags:    

Similar News