విశ్వక్రీడలు వాయిదా...

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇప్పటికే పలు క్రీడలలో జరగాల్సిన సిరీస్ లు రద్దు అయ్యాయి.

Update: 2020-03-24 14:05 GMT
Tokyo Olympics 2020

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇప్పటికే పలు క్రీడలలో జరగాల్సిన సిరీస్ లు రద్దు అయ్యాయి. ఇక తాజాగా వచ్చే ఏడాది వరకు ఒలపిక్స్ క్రీడలు వాయిదా పడ్డాయి.. ఈ యేడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదికి వాయిదా వేస్తూ జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటగా షెడ్యూల్‌ ప్రకారం విశ్వక్రీడలను నిర్వహిస్తామన్న అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య(ఐవోసీ) అందరి ఒత్తిడితో తగ్గింది.

ఆయితే వాయిదా వేసే అవకాశం తప్ప రద్దు చేసే ఆలోచన లేదని తేల్చిచెప్పింది. రాబోయే నాలుగు వారాల్లోపు ఒలింపిక్స్‌ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని, క్రీడలకంటే ప్రజల ప్రాణాలు అమూల్యమైనవనీ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ప్రకటించారు. ఇక జపాన్‌ ప్రధాని షింజో ఏబ్‌ సైతం పార్లమెంట్‌లో ఇదే విషయాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News