అమెరికా చరిత్రలోనే తొలిసారిగా..జో బైడెన్ రికార్డ్!!

* అమెరికాలో డెమొక్రాట్‌ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం * పాలన యంత్రాంగంపై దృష్టి పెట్టిన జో బైడెన్‌ * 20 మంది ఇండియన్లకు కీలక పదవులు * అగ్రరాజ్య చరిత్రలో ఇదే తొలిసారి

Update: 2021-01-18 03:38 GMT

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ (ఫైల్ ఫోటో)

అమెరికాలో డెమొక్రాట్‌ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఓటమిని ఇంకా అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్‌ అధికార మార్పిడికి సహకరించనప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ పాలనా యంత్రాంగంపై దృష్టిపెట్టారు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టారు. మొదట్నుంచీ భారత్‌పై సానుకూలంగా వ్యవహరిస్తున్న బైడెన్‌.. తన కేబినెట్‌లోనూ భారత అమెరికన్లకు చోటు కల్పిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో కొలువుదీరనున్న జో బైడెన్‌ ప్రభుత్వం అనేక అంశాల్లో విశిష్టత సంతరించుకోబోతోంది.

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 20 మంది భారతీయ-అమెరికన్లు బైడెన్‌ బృందం లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ భారతీయ మూలాలున్నవారే. ఆమెనే కాక- తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సంతతికి చెం దిన ప్రముఖులను తన బృందంలోకి తీసుకుంటానని బైడెన్‌ గతంలోనే వెల్లడించారు.


Tags:    

Similar News