గుంటూరు చిన్నారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్మానం

పదేళ్ల తెలుగమ్మాయికి అరుదైన ఘనత దక్కింది. ఆ బాలిక చేసిన పనికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సత్కరించారు.

Update: 2020-05-19 06:05 GMT
Guntur Child Sravya, Donald Trump

పదేళ్ల తెలుగమ్మాయికి అరుదైన ఘనత దక్కింది. ఆ బాలిక చేసిన పనికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సత్కరించారు. గుంటూరుకు చెందిన అన్నపరెడ్డి శ్రావ్య తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హన్నోవర్‌లో నివసిస్తుంది. ఆమె తండ్రి అమెరికాలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు.

అమెరికాలో కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిలో ఉత్సహం నింపేలా తన వంతుగా వంద బాక్సులు బిస్కెట్లు అందించింది. వైద్య సిబ్బందిని ప్రోత్సహించేలా గ్రీటింగ్ కార్డులను పంపింది. ఈ చిన్నారి శ్రావ్య చేసిన చిన్న సాయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆకర్షించింది. ఆయనే స్వయంగా శ్రావ్యతో పాటు మరో ఇద్దరు బాలికలను వైట్ హౌజ్‌కు పిలిపించుకొని సత్కరించారు.

ఈ సందర్భంగా ఆ బాలిక మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తనకు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని తెలిపింది. శ్రావ్య తల్లి సీత స్వస్థలం గుంటూరు జిల్లాలోని నరసయ్యపాలెం ట్రంప్ చేతుల మీదుగా శ్రావ్యకు సన్మానం జరగడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News