Operation Sindoor: పాక్ కవ్వింపులకు గట్టి బదులిస్తోన్న భారత్.. శత్రు మిలిటరీ పోస్ట్ ధ్వంసం.. వీడియో షేర్ చేసిన భారత ఆర్మీ
Operation Sindoor: పాక్ కవ్వింపులకు గట్టి బదులిస్తోన్న భారత్.. శత్రు మిలిటరీ పోస్ట్ ధ్వంసం.. వీడియో షేర్ చేసిన భారత ఆర్మీ
Operation Sindoor: భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. క్షణక్షణం భయంతో బతుకుతోంది పాకిస్తాన్. భారత్ దాడులకు బిక్కుబిక్కుమంటూ బంకర్లలోకి వెళ్లిపోయారు పాక్ ప్రధాని. ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా దాయాది సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడుతోంది. వీటిని భారత ఆర్మీ కూడా గట్టితిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారతీ ఆర్మీ షేర్ చేసింది.
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లతో పాకిస్తాన్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేస్తున్నట్లు ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. భారత దాడిలో పాకిస్తాన్ పోస్టు కుప్పకూలింది. అయితే ఏ సెక్టార్ లోని పోస్టులను నేలకూర్చారన్నది మాత్రం తెలియలేదు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని భారత ఆర్మీ ప్రకటించింది. ఇప్పటి వరకు 50 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలుస్తోంది.