India - Britain: బ్రిటన్‌కు షాక్‌ ఇచ్చిన భారత్

India - Britain: *కచ్చితంగా 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే *మూడు ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌లు చూపించాల్సిందే

Update: 2021-10-02 02:46 GMT

బ్రిటన్‌కు షాక్‌ ఇచ్చిన భారత్

India - Britain: భారత్ బ్రిటన్‌‌కు గట్టి షాక్ ఇచ్చింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారు.. భారత్ నుంచి బ్రిటన్ వెళ్లేవారికి 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు నిబంధనలు పెట్టారు. అయితే ఈ నిబంధనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. దీనిలో భాగంగానే బ్రిటన్ నుంచి వచ్చే పౌరులపై ఆంక్షలు విధించాలని భారత్ నిర్ణయించింది. బ్రిటన్ పౌరులను 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు మూడుసార్లు కొవిడ్ పరీక్షలు వంటి ఆంక్షలను అమలు చేయనుంది.

అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 4న భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు మూడు ఆర్టీపీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, అనంతరం 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటి వద్ద, లేదా హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 

Tags:    

Similar News