India is not reducing tariffs on Imports from US: అమెరికా విషయంలో భారత్ తాజా ప్రకటన... మరి ట్రంప్ చెప్పింది అబద్దమేనా?
India is not reducing tariffs on Imports from US: అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్ విధించే సుంకాన్ని తగ్గించడం లేదని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలో అమెరికాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్రం పార్లమెంట్ ప్యానెల్ కు చెప్పినట్లుగా ఎన్డీటీవీ వార్తా కథనం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదేపదే ఎత్తుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరినట్లు కేంద్రం చెప్పింది.
అయితే, మార్చి 7న డోనల్డ్ ట్రంప్ వైట్ హౌజ్‌లో అమెరికా మీడియాతో మాట్లాడుతూ అమెరికా దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని అన్నారు. ఎట్టకేలకు భారత్ దిగొచ్చిందన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఏప్రిల్ 2 నుండి భారత్ ఉత్పత్తులపై భారీ సుంకం విధిస్తామన్న అమెరికా హెచ్చరికలకు భారత్ దిగొచ్చిందనే సంకేతాలు వెళ్లాయి.
తాజాగా ఇదే విషయమే వాణిజ్యం శాఖ కార్యదర్శి సునిల్ బర్త్‌వాల్ మాట్లాడుతూ అమెరికా, భారత్ మధ్య వాణిజ్యంలో పరస్పరం లబ్ధి పొందేలా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంలో అవి రెండు దేశాలకు మేలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. అంతేతప్ప తక్షణమే సుంకాలు తగ్గించడం లాంటి ప్లాన్స్ ఏవీ చేయడం లేదని తెలిపారు.
డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు భారత్ ప్రకటన భిన్నంగా ఉంది. దీంతో అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని గత వారం ట్రంప్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Donald Trump about India Tariffs: ఎట్టకేలకు భారత్ దిగొచ్చింది... ఎందుకంటే - అమెరికన్ మీడియాతో ట్రంప్
Trump tariffs Impacts on India: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియాకు జరిగే నష్టం ఎంతో తెలుసా?