India-Pakistan War: యుద్ధానికి దిగితే నాలుగు రోజుల్లో పాక్‌ పని ఖతం.. ఇవే సాక్ష్యాలు!

India-Pakistan War: ప్రస్తుత సమాచారాన్ని బట్టి, పాక్ ఆర్మీకి ఉన్న 155 మిల్లీమీటర్ల షెల్స్, 122 మిల్లీమీటర్ల రాకెట్లు సరిపడని స్థాయిలో ఉన్నాయి.

Update: 2025-05-04 11:00 GMT

India-Pakistan War: భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాక్ సైన్యం తీవ్రమైన ఆయుధాల కొరతతో ఎదురైతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఉన్న మందుగుండు సామగ్రితో పాకిస్తాన్ నాలుగు రోజులు మాత్రమే పూర్తి స్థాయి యుద్ధానికి తట్టుకోగలగడం గమనార్హం. ప్రత్యేకించి ఆర్టిలరీ గోలీల కొరత పాక్ రక్షణ వ్యవస్థను బలహీనంగా మార్చుతోంది.

ఇటీవల యుక్రెయిన్‌కి పాక్ అందించిన ఆయుధ డీల్స్ వల్ల యుద్ధ నిల్వలు దెబ్బతిన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల డిమాండ్ పెరిగిపోవడం, పాక్‌కి ఉన్న పాత తయారీ సామర్థ్యం వల్ల పునఃనిర్మాణం కష్టతరమైంది. ఈ పరిస్థితులు, భారత్ దాడికి దిగుతుందని భావిస్తున్న సమయంలో పాకిస్తాన్ పన్నే వ్యూహాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

ప్రస్తుత సమాచారాన్ని బట్టి, పాక్ ఆర్మీకి ఉన్న 155 మిల్లీమీటర్ల షెల్స్, 122 మిల్లీమీటర్ల రాకెట్లు సరిపడని స్థాయిలో ఉన్నాయి. ముందస్తుగా కొంత సామాగ్రిని యుద్ధ భయంతో ఇండియా-పాక్ సరిహద్దుల్లో నిల్వ చేయించినా, ఉత్పత్తిలో జాప్యం వల్ల అవి మళ్లీ తిరిగి భర్తీ చేయడం కష్టంగా మారింది.

మే 2న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్స్ సమావేశంలో ఆయుధాల కొరత సమస్యపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పాక్ మాజీ ఆర్మీ చీఫ్ బాజ్వా ఇప్పటికే గతంలో ఒక సందర్భంలో పాక్ సైన్యం సుదీర్ఘ యుద్ధానికి తగిన ఆర్థిక వనరులు, బులెట్ల నిల్వలు లేవని అంగీకరించారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అదే హెచ్చరిక నిజమవుతోందని అర్థమవుతోంది.

Tags:    

Similar News