Bill Gates about India: భారత్ కే ఆ సత్తా ఉంది.. వ్యాక్సిన్ పంపిణీపై బిల్ గేట్స్ సంచలన ప్రకటన

Bill Gates about India: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో ప్రపచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పై చర్చ నడుస్తోంది.

Update: 2020-07-17 03:30 GMT
Bill Gates (File Photo)

Bill Gates about India: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో ప్రపచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పై చర్చ నడుస్తోంది. ఆగష్టు నెలలో మాదని, అక్టోబరు నెలలో మా దేశంలోనే వ్యాక్సిన్ వస్తుందని ఇలా ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటున్నారు. దీనికి మద్దతుగా ఏ దేశమైనా కాని వ్యాక్సిన్ వస్తే చాలని ప్రపంచ వాసులంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. వ్యాక్సిన్ తయారు చేసి, ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసే సత్తా భారత్ కే ఉందని ప్రకటించారు.

కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలన్నింటికి పంపిణీ చేయగల సత్తా భారత్‌కి మాత్రమే ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి భారత్‌లో ఎన్నో ట్రయల్స్‌  పూర్తి అయ్యాయని, టీకా డోసుల్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సత్తా భారత ఫార్మా పరిశ్రమకు మాత్రమే ఉందని ఆయన కొనియాడారు. 'కోవిడ్‌–19 వైరస్‌పై భారత్‌ యుద్ధం' పేరుతో ఓ‌ ఛానల్‌లో ప్రసారమైన డాక్యుమెంటరీలో ఆయన మాట్లాడారు.

అతి పెద్ద దేశం, ఎక్కువ జనాభా వంటి అంశాలు ఉన్నప్పటికీ కరోనా వైరస్‌తో భారత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. "భారత్‌లో చాలా సామర్థ్యం ఉంది. అక్కడి డ్రగ్‌, వ్యాక్సిన్‌ కంపెనీలు ప్రపంచమంతా వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలవు. చాలా వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారవుతాయి. అక్కడి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ చాలా పెద్దది" అని దేశీయ ఫార్మా పరిశ్రమపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బయోటెక్నాలజీ శాఖలో బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కూడా భాగస్వామిగా ఉందని ఆయన వివరించారు. తమ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలకు సహకారం అందిస్తూనే యూపీ, బీహార్‌లలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని బిల్‌ గేట్స్ ఈ సందర్భంగా తెలిపారు.


Tags:    

Similar News