ముక్కులో పెరిగిన దంతం...

Update: 2019-11-13 08:35 GMT

సర్వసాధారణంగా ఎవరికైనా దంతాలు ఎక్కడుంటాయి, నోట్లోనే ఉంటాయి. కానీ ఒక వ్యక్తికి మాత్రం ముక్కులో ఉంది. ఇదేంటబ్బా అనుకుంటున్నారా.. వింటుంటే ఆశ్చర్యంగా ఉందా. అది నిజమే చైనా దేశంలో ఈ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ప్రపంచంలో అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. 0.1% ప్రజలు మాత్రమే ఇలాంటి సమస్యతో భాధపడతారని వైద్యులు నిర్దారించారు. అసలు అతనికి ఈ సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకుందాం.

చైనాకు చెందిన ఝాంగ్ బిన్షెంగ్ (30) గత మూడు నెలలుగా ముక్కు నొప్పితో బాధపడుతున్నాడు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా అతనికి ఇబ్బందిగా మారింది. విషయం తెలియని ఆ వ్యక్తి డాక్టర్ ని సంప్రదించడంతో ముక్కులో పన్ను పెరుగుతుందన్న విషయం బయటపడింది.

అసలు ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఇతను తన చిన్నతనంలో ఓ షాపింగ్ మాల్‌లోని మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. అప్పుడు అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని దంతాలు కూడా ఉడాయి. ఆ సమయంలోనే ఊడిన పంటిలోంచి ఒక చిన్న ముక్క దవడకి, ముక్కుకి మధ్య కండరంలో ఇరుక్కు పోయింది. అప్పుడు దాన్ని గమనించని వైద్యులు వొదిలేసారు. అప్పటినుంచి ఆ పంటి ముక్క కాస్త కాస్త పెరుగుకుంటూ పెద్దదవడం మొదలైంది. ఎక్సరే రిపోర్ట్ లో విషయాన్ని గమనించిన వైద్యులు వెంటనే సర్జరీని ప్రారంభించారు. 30 నిమిషాల పాటు శ్రమించి ఆ పంటిని తొలగించారు. పెరిగిన పన్ను ఒక సెంటీ మీటరు పొడవు ఉన్నట్లు తెలిపారు. మెడికల్ రికార్డుల ప్రకారం 1959 నుంచి 2008 మధ్య 23 కేసులు నమోదయ్యాయని వైద్యులు పేర్కొన్నారు.



Tags:    

Similar News