California Huntington Beach: కాలిఫోర్నియా బీచ్‌లో భారీగా లీకవుతున్న ఆయిల్

*హంటింగ్టన్ బీచ్‌ సమీపంలో చమురు బావి నుంచి లీకేజీ *బీచ్ పరిసరాల్లో భారీ ఎత్తున వ్యాపించిన క్రూడ్ ఆయిల్

Update: 2021-10-04 13:15 GMT

కాలిఫోర్నియా బీచ్‌లో భారీగా లీకవుతున్న ఆయిల్(ఫైల్ ఫోటో)

California Huntington Beach: ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్‌తో భయం గుప్పిట్లో ఉన్న ప్రపంచంపై మరో పిడుగులాంటి వార్త పడింది. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్‌ సమీపంలో చమురు బావి నుంచి ప్రవాహంలా తన్నుకొచ్చింది. దీంతో అక్కడి ఇసుక తిన్నెల్లో మృతి చెందిన పక్షులు, చేపలతో పరిస్థితి హృదయ విదారకంగా మారిపోయింది. బీచ్‌కు సమీపంలోని చిత్తడి నేలలన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలిఫోర్నియా బీచ్ దగ్గర నిర్వహించే వార్షిక ఎయిర్ షోలు కూడా రద్దయ్యాయి.

ప్రస్తుతం కాలిఫోర్నియా బీచ్‌ దగ్గర దాదాపు లక్షా 23వేల గ్యాలన్లు ముడి చమురు పసిఫిక్ మహా సముద్రంలో కలుస్తోంది. బీచ్‌ సమీపంలోని దక్షిణ లాస్‌ ఏంజెల్స్‌ సిటీలో 40 మైళ్ల వరకు దీని ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో గందర గోళ పరిస్థితి నెలకోంది. వాతావరణమంతా క్రూడ్ ఆయిల్ దుర్గంధంతో నిండిపోయింది. హంటింగ్టన్ బీచ్ సమీపంలో ఉన్న చమురు బావిలో అయిల్ లీకవుతున్న విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. లీకేజీని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు సముద్రం పై భాగంలో దాదాపుగా 13 మైళ్ళ మేర చమురు పొర వ్యాపించి ఉండవచ్చని హంటింగ్టన్ బీచ్‌ మేయర్ కిమ్ కార్ తెలిపారు. ఆయిల్ లీక్ కావడంతో పెద్ద సంఖ్యలో సముద్ర జీవరాశి మరణించింది. పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. దీనిని పెద్ద పర్యావరణ విపత్తుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ఆయిల్ లీక్‌ ఎక్కడ ఎందుకు సంభవించిందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపడుతున్నామని కాలిఫోర్నియా అధికారులు తెలిపారు.

Tags:    

Similar News