Colombia: కొలంబియాలో భారీ వర్షాలు
Colombia: పెరీరా ప్రాంతంలో విరిగిపడిన కొండచరియలు
Colombia: భారీ వర్షాలతో కొలంబియా అతలాకుతలమవుతోంది. సెంట్రల్ కొలంబియాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. రిసారాల్డా ప్రావిన్సుల్లోని డోస్క్యూ బ్రదాస్ మున్సిపాల్టీ పరిధిలోని అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడి బండరాళ్లు, మట్టిలో ఇళ్లు కూరుకుపోయాయి. భారీ వర్షాలతో నదుల్లో ప్రవాహం ప్రమాదస్థాయిని మించడంతో స్థానిక ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కొలంబియా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.