China: చైనాలో కుండపోత వర్షాలు... ధ్వంసమైన 2,700 ఇళ్లు

China: హునాన్‌ ప్రావిన్స్‌ను ముంచెత్తుతున్న వరదలు

Update: 2022-06-09 07:45 GMT

China: చైనాలో కుండపోత వర్షాలు.. ధ్వంసమైన 2,700 ఇళ్లు

Heavy Rains in China: కుండపోత వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. మధ్య చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌ను వరద ముంచెత్తింది. లోతుట్టు ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. ఈ వరదల్లో 10 మంది మృతి చెందగా, ముగ్గురు అచూకీ గల్లంతయ్యింది. ముంపు ప్రాంతాల్లో పలువురి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. రహదారులు కోతలకు గురయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ఇళ్లలోకి వదర రావడంతో నిత్యావసరాలు నీటిపాలయ్యాయి. 17 లక్షల మంది వరదలతో సతమతమయయారు. ఇక వరదలకు 2వేల 700 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. వేలాది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని హునాన్‌ అధికారులు చెబుతున్నారు. వరద తగ్గడానికి మరి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మధ్య చైనాలో ఈ నెల మొదటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా 9 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు ఉధృతమవడంతో నదులకు వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు సహాయక చర్యలు చేపట్టాయి. వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడారు. లోతట్టు ప్రాంతాల నుంచి 2 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వారికి దుప్పట్లు, ఆహారం ప్రభుత్వం అందిస్తోంది. రహదారులను పునర్‌ నిర్మిస్తున్నారు. సౌత్‌ సెంట్రల్‌ చైనాలో ఏటా భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో వరదలు కూడా అంతే కామన్‌ అయిపోయాయి. గతేడాది భారీ వదరలకు 300 మందికి పైగా చనిపోయారు. 

Tags:    

Similar News