Global heating crisis: UN షాకింగ్‌ ప్రకటన.. మరో నాలుగేళ్లలో యుగాంతం?

Global heating crisis: ఐక్యరాజ్యసమితి ప్రపంచానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో.. అంటే 2025-2029 మధ్యకాలంలో భూమిపై సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశాలు ఏకంగా 70 శాతంగా ఉన్నాయని ప్రకటించింది.

Update: 2025-05-31 14:12 GMT

Global heating crisis: UN షాకింగ్‌ ప్రకటన.. మరో నాలుగేళ్లలో యుగాంతం?

Global heating crisis: ఐక్యరాజ్యసమితి ప్రపంచానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో.. అంటే 2025-2029 మధ్యకాలంలో భూమిపై సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశాలు ఏకంగా 70 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. ఇప్పటికైనా దేశాలు ఈ ఘోరాన్ని గమనించకపోతే.. ఈ ఉష్ణోగ్రతలు శాశ్వతంగా నిలిచిపోతాయని UN హెచ్చరిస్తోంది. అనేక ప్రపంచ స్థాయి వాతావరణ కేంద్రాల అంచనాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక భవిష్యత్తు గురించి ఆందోళన కలిగించే నిజాలను బయటపెడుతోంది. ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ వేడి కూడా పెరిగే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది UN.

ఒకవైపు భూమి మండిపోతూ.. నిప్పుల్లా కాలిపోతుంటే.. మరోవైపు ప్రపంచ నాయకులు దేశాల సభల్లో గొప్ప మాటలు చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు కానీ.. ఆ మాటల్లో నిజం ఎంతుందో తెలియదు. గ్లోబల్ వార్మింగ్ అనే మహా శత్రువు ప్రపంచాన్ని చుట్టేస్తుంటే.. నాయకులు ఇంకా పెట్రోల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గ్యాస్ సంస్థలకు సబ్సిడీలు ఇస్తున్నారు. బొగ్గు తవ్వకాలు ఆపాలని చెబుతూనే కొత్త మైనింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు.

ప్రపంచం ఇప్పటికే భయంకరమైన వాస్తవాలను ఎదుర్కొంటోంది. చైనాను భయంకరమైన ఎండలు నలిపేస్తుంటే. పాకిస్తాన్‌లో తుపాన్లు ప్రాణాలు తీస్తున్నాయి. కెనడాలో అడవులు నిప్పుల పాలు అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నా.. వాస్తవాల్లో మంటలున్నా, ప్రపంచం మౌనంగా చూస్తోంది. వర్షాలు దారుణంగా పడుతున్నా, తాపం పెరిగిపోతున్నాయి. ప్రపంచం కాలిపోతుంటే నాయకులు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పని వరకు మార్పు రాదు. మాట్లాడే సమయం ఎప్పుడో గడిచిపోయింది... ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం. లేకపోతే మన భవిష్యత్తు మాత్రమే కాదు.. సమాస్త కోటి జీవరాశులకు మూలమైన భూమి భవిష్యత్తే ఉండదు.

Tags:    

Similar News