నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతిపై అమెరికాలో ఆగని జనాగ్రహం

Update: 2020-06-01 04:52 GMT

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతిపై అమెరికాలో ఆగని జనాగ్రహం పెల్లుబికింది. జార్జి ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రికన్ ‌అమెరికన్‌ను శ్వేత జాతి పోలీసు అధికారులు పొట్టనబెట్టుకోవడంపై పెల్లుబికుతున్న ప్రజాఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లాయిడ్‌ ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు, అమెరికా జాతీయ పతాకానికి నిప్పు పెట్టారు. మినియాపొలిస్‌లో రాజుకున్న అశాంతి అగ్గి అమెరికాలోని ఇతర నగరాలకూ వ్యాప్తి. అట్లాంటా, డెన్వెర్, లాస్‌ఏంజెలిస్, మినియాపొలిస్, శాన్‌ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌ సహా 12కు పైగా నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.

అధ్యక్ష్యభవనం వైట్ హౌస్ బయట పెద్దఎత్తున ఆందోళన కారులు గుమిగూడడంతో ముందు జాగ్రత్తగా ట్రంప్ ను సీక్రెట్ బంకర్ లోకి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు తరలించారు. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పు పెట్టిరు.

ఆందోళనలకు కేంద్ర బిందువైన మినియాపొలిస్‌లో పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగం ద్వారా ఆందోళనలను అదువులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం 4 వేల నేషనల్‌ గార్డులను రంగంలోకి దింపింది. ఇండియానాపొలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు , రెండు రోజుల క్రితం డెట్రాయిట్, మినియాపొలిస్‌ల్లో జరిగిన ఘటనల్లోనూ ఇద్దరు మృతి చెందారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారుల దాడిలో 13 మంది పోలీసులు గాయపడగా నాలుగు పోలీసు వాహనాలు కాలిబూడిదయ్యాయి.

న్యూయార్క్‌లో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడం కొట్లాటలకు దారి తీసింది. గురువారం నుంచి ఇప్పటి వరకు 22 నగరాల్లో 2,500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లాస్‌ఏంజెలిస్‌ నగరంలో నిరసన కారులు భవనాలు, వాహనాలకు నిప్పుపెడుతుండటంతో అత్యవసర పరిస్థితిని ప్రకతించింది.

Tags:    

Similar News