ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ఉత్తర ఆఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్‌ను ఫ్రెంచ్ సైన్యం మట్టుబెట్టింది. మాలిక్ కోసం ఫ్రెంచ్, మాలి సైన్యాలు ఏడేళ్లుగా గాలిస్తుండగా ఎట్టకేలకు పని పూర్తి చేశాయి. నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో అబ్దుల్ మాలిక్ ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్ ప్రకటన విడుదల చేసింది.