America: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మృతి

America: కరోనాతో మృతి చెందిన కొలిన్‌ పావెల్‌ * కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా పావెల్‌కు కరోనా

Update: 2021-10-18 16:30 GMT
అమెరిక విదేశాంగ శాఖ మంత్రి కొలిన్ పావెల్ మృతి (ఫైల్ ఇమేజ్)

America: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలిన్‌ పావెల్‌ కరోనాతో మృతి చెందారు. ఆయన మృతి వార్తను కుటుంబ సభ్యులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆయన పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నారని.. అయినప్పటికీ కోవిడ్ సంబంధిత సమస్యలు రావడంతో వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్ లో చేర్పించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పావెల్ తుదిశ్వాస విడిచారు. జార్జిబుష్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2001 నుంచి 2005 వరకు పావెల్ విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ ఛైర్మన్‌గా కూడా జనరల్‌ పావెల్‌ పనిచేశారు.

Similar News